మహాబలేశ్వరంలో 'ఆర్ఆర్ఆర్' హంగామా

Update: 2020-12-03 15:50 GMT

దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కతున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఇటీవలే హైదరాబాద్ లో సుదీర్ఘమైన షూటింగ్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఇప్పుడు మహాబలేశ్వరంలో ఈ సినిమా షూటింగ్ నడుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ చిన్న షెడ్యూల్‌ని జక్కన్న మహాబలేశ్వర్‌లోని అందమైన లొకేషన్స్‌లో ప్లాన్‌ చేశారు.

అంతే కాదు షూట్‌ కూడా అక్కడ మొదలైనట్లుగా ఓ వీడియోను 'ఆర్‌ఆర్‌ఆర్‌' టీమ్‌ విడుదల చేసింది. ఆర్‌ఆర్‌ఆర్‌ డైరీస్‌ అంటూ చిత్రయూనిట్‌ షేర్‌ చేసిన ఈ వీడియోలో మూవింగ్ క్రేన్ షాట్లు, డ్రోన్ షాట్లలతో బైక్‌ మీద వెళుతున్న సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ ఈ షూట్‌లో జాయిన్‌ అవుతారని చిత్రయూనిట్‌ పేర్కొంది.

Tags:    

Similar News