Full Viewఒక్కటంటే ఒక్క డైలాగ్ లేదు. ఓన్లీ యాక్షన్ సన్నివేశాలు. ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవగన్, ఆలియా భట్ లతో కూడిన ఆర్ఆర్ఆర్ గ్లింప్స్ బయటకు వచ్చేసింది. ఈ గ్లింప్స్ చూస్తే ఈ సినిమా ఎంత భారీ స్థాయిలో చిత్రీకరించారో తెలుస్తోంది. దీంతో ఆర్ఆర్ఆర్ హంగామా మొదలైంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ లు తొలిసారి కలసి నటిస్తున్న మల్టీస్టారర్ మూవీకి సంబంధించిన తొలి గ్లింప్స్ విడుదలైంది. కొన్ని సన్నివేశాలు బాహుబలి తరహా హంగామాను తలపించాయి. చిత్ర యూనిట్ ముందు ప్రకటించినట్లుగానే సోమవారం ఉదయం పదకొండు గంటలకు దీన్ని విడుదల చేసింది.
దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ భారీ బడ్జెట్ మూవీ జనవరి 7న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్టీఆర్, రామ్ చరణ్ ల పాత్రలకు సంబంధించి పరిచయ వీడియోలను విడుదల చేశారు. దీంతోపాటు దోస్తీ సాంగ్ కూడా విడుదలైంది. ఇప్పుడు తొలిసారి గ్లింప్స్ విడుదల చేయటం ద్వారా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేయనున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుంటే.ఎన్టీఆర్ కు జోడీగా హాలీవుడ్ నటి ఒలివా మోరిస్ సందడి చేయనున్నారు.