దేశంలోనే అతిపెద్ద యాక్షన్ మూవీగా చిత్ర యూనిట్ దీన్ని పేర్కొంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుంటే..రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా అలియా భట్ నటిస్తుంటే..ఎన్టీఆర్ కు జోడీగా హాలీవుడ్ భామ ఒలీవియో నటిస్తోంది. తాజాగా విడుదల చేసిన మేకింగ్ వీడియో చూస్తే ఆర్ఆర్ఆర్ ఎంత గ్రాండ్ గా ఉండబోతుందో అర్ధం అవుతుంది. ఈసినిమాలో అజయ్ దేవగన్, శ్రియ, సముద్రఖని తదితరులు నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మాతగా ఉన్నారు.