సబ్జెక్ట్ ఏదైనా కావొచ్చు. సమస్య ఏదైనా ఉండొచ్చు. వివాదం ఎక్కడ ఉంటే అక్కడ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఉండాల్సిందే. కొన్నిసార్లు వివాదాలు ఆయనే రేపుతారు. వాటికి కేంద్ర బిందువుగా కూడా మారతారు. కొద్ది రోజుల క్రితం జరిగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసిషన్ (మా) ఎన్నికల సందర్భంగా జరిగిన రగడపైన కూడా ఆయన ట్వీట్ చేశారు. ఇది అంతా సర్కస్ ను తలపిస్తోంది అంటూ ఎద్దేవా చేశారు. తాజాగా ఆయన ఏపీ రాజకీయాలపై ట్వీట్ పెట్టారు. ప్రస్తుతం ఏపీలో అధికార వైసీపీ, టీడీపీల మధ్య రాజకీయ యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే.
టీడీపీ నేత పట్టాభి చేసిన అభ్యంతకర వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ శ్రేణులు పట్టాభి ఇంటితోపాటు టీడీపీప్రధాన కార్యాలయంపై కూడా దాడులకు దిగాయి. వీటిపై ఆయన స్పందిస్తూ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు చూస్తుంటే అక్కడి నేతలు బాక్సింగ్, కర్రసాము, కరాటే నేర్చుకోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. అక్కడ ఉన్న ఉద్రిక్త పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.వర్మ ఇప్పుడు కొండాసురేఖ, కొండా మురళీల జీవిత చరిత్రపై సినిమా తీస్తున్నారు.