బిగ్ బాస్ హౌస్ లో తొలిసారి కెప్టెన్ పై తిరగుబాటు. నువ్వు చెప్పిన పనులు మేం చేయం పో..కెప్టెన్ అయితే ఏంటి..నువ్వు ఏది చెపితే అది చేస్తామా? అంటూ తిరుగుబాటు చేస్తున్నారు సభ్యులు. దీంతో ఈ వ్యవహారం రంజుగా మారుతోంది. అనూహ్యంగా ఈ వారంలో అమ్మ రాజశేఖర్ కెప్టెన్ అయ్యారు. ఎప్పటి నుంచో అమ్మరాజశేఖర్ ఎలిమినేట్ అవుతారనే అంచనాలు వెలువడుతున్నా అందుకు భిన్నంగా ఆయన హౌస్ లో కొనసాగటమే కాదు..అనూహ్యంగా కెప్టెన్ గా ఎంపికయ్యారు కూడా. కెప్టెన్ గా ఎన్నికైన తర్వాత పనుల విభజన సమయంలో తన మిత్రులకు తేలిక పాటి పనులు అప్పగించి..తానంటే పడని వారికి ఎక్కువ పనులు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇదే తిరుగుబాటుకు కారణం అయింది.
పనులు చేయబోం అన్న సభ్యులను కూడా చేయకపోతే పోండి అంటూ రాజశేఖర్ అంతే లైట్ తీసుకుంటున్నారు. సభ్యులు అభిజిత్, హారిక, సోహైల్ తదితరులు అమ్మ రాజశేఖర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభిజిత్ ఆవేశంతో ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే బిగ్ బాస్ మరో సారి తెలుగులో మాట్లాడాలని వార్నింగ్ ఇస్తారు. ఇది చూసిన అమ్మ రాజశేఖర్ ఎస్...అంటూ ఆనందంతో కేరింతలు కొడతారు. మాస్టర్ ఈసారి మళ్లీ నామినేషన్‌లో ఉన్నా కెప్టెన్ గా ఎన్నికయ్యారు. సో ఈ వారం ఏదోలా చేసి తప్పించుకుంటే వచ్చే వారం కెప్టెన్ గా ఎలిమినేషన్ నుంచి ఇమ్యూనిటి లభిస్తుంది. ఈ వారం రాజశేఖర్ సేఫ్ అవుతారా లేదా వేచిచూడాల్సిందే.