'రిపబ్లిక్' టీజర్ లో వివాదస్పద వ్యాఖ్యలు
సాయి ధరమ్ తేజ్, ఐశ్వర్య రాజేష్ జంటగా నటిస్తున్న సినిమా 'రిపబ్లిక్'. దేవా కట్టా దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను చిత్ర యూనిట్ సోమవరం నాడు విడుదల చేసింది. ఇప్పటికే సాయి ధరమ్ తేజ్, రమ్యకృష్ణల లుక్స్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కుతున్నఈ సినిమాలో రమ్యకృష్ణ పవర్ ఫుల్ పాత్ర పోషించినట్లు సమాచారం.
'ప్రజాస్వామ్యం అంటే కేవలం ఓటు హక్కో..అరిచే హక్కో అనే భ్రమలో ఉన్నాం. ప్రజలే కాదు..సివిల్ సర్వెంట్స్..కోర్టులు కూడా ఆ రూలర్స్ కింద బానిసలుగా బతుకుతున్నారు. ' అంటూ హీరో డైలాగ్ లతో టీజర్ విడుదల అయింది. కోర్టులు కూడా పాలకుల కింద బానిసల్లా బతుకుతున్నారు అనటం దుమారం రేపటం ఖాయంగా కన్పిస్తోంది. ఈ సినిమా జూన్ 4న థియేటర్లలో సందడి చేయనుంది.