రవితేజ 'ఖిలాడి' కూడా చెప్పేశాడు

Update: 2021-01-30 11:33 GMT

రవితేజ కూడా 'ఖిలాడి' విడుదల తేదీ చెప్పేశాడు. మే 28న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా క్రాక్ తో హిట్ కొట్టిన రవితేజ కొత్త సినిమాపై కూడా భారీ ఆశలే పెట్టుకున్నాడు. ఈ సినిమాలో రవితేజకు జోడీగా డింపుల్ హయతి, మీనాక్షి చౌదరిలు సందడి చేయనున్నారు. పెన్‌ స్టూడియోస్‌ సమర్పణలో హవీష్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా వచ్చిన తేదీల ప్రకారం చూస్తే సమ్మర్ లో బాక్సాఫీస్ వద్ద సినిమాల సందడి భారీగా పెరగనుంది. మే 14న వెంకటేష్‌ నటించిన నారప్ప చిత్ర కూడా రిలీజ్‌ కానుంది. 

Tags:    

Similar News