రవి తేజ సడెన్ సర్ప్రైజ్ ఇచ్చాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా మిస్టర్ బచ్చన్. ఈ సినిమా ను ఆగస్ట్ 15 న విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ఆదివారం నాడు అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే పూరి జగన్నాథ్ తెరకెక్కించిన డబుల్ ఇస్మార్ట్ సినిమా ను ఆగస్ట్ 15 న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు అదే రోజు మిస్టర్ బచ్చన్ కూడా విడుదల కానుంది. అయితే ఒక రోజు ముందుగానే అంటే ఆగస్ట్ 14 న మిస్టర్ బచ్చన్ ప్రీమియర్స్ ప్రదర్శించనున్నట్లు కూడా వెల్లడించారు. వాస్తవానికి ఆగస్ట్ 15 న అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా విడుదల కావాల్సి ఉంది.
పుష్ప 2 వాయిదా పడటంతో ఈ డేట్ ను ఫస్ట్ డబుల్ ఇస్మార్ట్ లాక్ చేసుకోగా..ఇప్పుడు అదే డేట్ కు రవి తేజ సినిమా మిస్టర్ బచ్చన్ కూడా రేసులోకి వచ్చింది. ఈ సినిమాలో రవి తేజ కు జోడిగా భాగ్య శ్రీ బోర్సే నటిస్తోంది. ఆమె చేస్తున్న తొలి తెలుగు సినిమా ఇదే. వీటి తో పాటు నివేదా థామస్ నటిస్తున్న 35 ..చిన్న కథ కాదు, ఆయ్ సినిమా కూడా ఆగస్ట్ 15 న డేట్ ఫిక్స్ చేసుకున్నాయి. ఒకే డేట్ లో నాలుగు సినిమాలు ..అందులో రెండు కీలక సినిమాల కింద లెక్క. చివరి వరకు అందరూ బరిలో నిలుస్తారా..లేక ఎవరైనా వాయిదా కు మొగ్గుచూపుతారా అన్నది వేచిచూడాల్సిందే.