రవి తేజ చేతికి గాయం...శస్త్ర చికిత్స

Update: 2024-08-23 13:07 GMT

భారీ హైప్ తో వచ్చిన సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దారుణ పరాజయం. మరో వైపు ప్రమాదం. మాస్ మహారాజా రవి తేజ కు ఆగస్ట్ నెల ఏ మాత్రం కలిసి రాలేదు. ఆర్ టి 75 షూటింగ్ లో పాల్గొంటున్న హీరో రవి తేజ కుడి చేతికి గాయం అయింది. దీంతో ఆయనకు హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో శస్త్ర చికిత్స చేశారు. ఇప్పుడు ఆయన ఆరు వారాలు విశ్రాంతిలో ఉండాల్సిన పరిస్థితి. గాయపడిన రవి తేజ అలాగే షూటింగ్ కొనసాగించడంతో ఈ పరిస్థితి వచ్చినట్లు చెపుతున్నారు.

                                              భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ టి 75 లో రవి తేజ కు జోడిగా శ్రీ లీల నటిస్తోంది. ఆగస్ట్ 15 న మిస్టర్ బచ్చన్ సినిమాతో రవి తేజ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ బోల్తా కొట్టింది అనే చెప్పాలి. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో పాటలు..హీరోయిన్ భాగ్యశ్రీ భోర్సే సినిమాపై అంచనాలు పెంచటానికి ఉపయోగపడినా కూడా ఇవేమి సినిమాను నిలబెట్టలేకపోయాయి. 

Tags:    

Similar News