Full Viewరవితేజ, శ్రీ లీల కాంబినేషన్ లో వచ్చిన ధమాకా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద విజయం దక్కించుకుందో అందరికి తెలిసిందే. ఇప్పుడు మరో సారి అదే కాంబినేషన్ రిపీట్ అవుతోంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న రవి తేజ 75 వ సినిమా పూజా కార్యక్రమం మంగళవారం నాడు జరిగింది. ఇందులో రవి తేజ తో పాటు హీరోయిన్ శ్రీ లీల కూడా పాల్గొంది. షూటింగ్ కూడా వెంటనే ప్రారంభం అవుతుంది అని...సినిమాను 2025 సంక్రాంతి కి విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ కొత్త సినిమా ఫుల్ కామెడీ, ఎంటర్ టైనర్ గా ఉంటుంది అని చెపుతున్నారు. ఈ సినిమాకు భీమ్స్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం రవి తేజ ‘మిస్టర్ బచ్చన్’ లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఫుల్ స్వింగ్ లో సాగుతుంది. మారి ధమాకా జోడి వచ్చే సంక్రాంతి కి ఎంత సందడి తెస్తుందో వేచిచూడాల్సిందే.