ఆకట్టుకుంటున్న మిస్టర్ బచ్చన్ ట్రైలర్

Update: 2024-08-07 14:31 GMT

Full Viewరవి తేజ కొత్త సినిమా మిస్టర్ బచ్చన్ పై పెద్ద ఎత్తున బజ్ ఏర్పడింది. గత కొంత కాలంగా చిత్ర యూనిట్ ఈ సినిమా పై అంచనాలు పెంచటంలో విజయవంతం అయింది అనే చెప్పాలి. ఆగస్ట్ 15 న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. బుధవారం నాడు ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రవి తేజ కు జోడిగా భాగ్యశ్రీ బోర్సే నటించింది. ఇప్పటికే విడుదల అయిన టీజర్ తో పాటు పాటలు కూడా రవి తేజ సినిమా విషయంలో ఆసక్తి పెంచాయనే చెప్పాలి. బుధవారం నాడు విడుదల అయిన ట్రైలర్ కూడా ఈ సినిమా ఎలా ఉండబోతుందో ఒక శాంపిల్ చూపించింది. ట్రైలర్ లో రవి తేజ చెప్పే డైలాగులు ఇన్ కం ట్యాక్స్ డిపార్ట్ మెంట్ ను కొత్త కోణంలో చుపించాయనే చెప్పాలి. సరిహద్దు కాపాడేవాడే సైనికుడు కాదు...సంపద కాపాడే వాడు కూడా సైనికుడే.

                                                            ఇండియన్ ఆర్మీ ఎంత పవర్ ఫుల్లో ..ఇన్ కం ట్యాక్స్ డిపార్ట్ మెంట్ కూడా అంత పవర్ ఫుల్ అని నిరూపిస్తా అంటూ రవి తేజ నోట పవర్ ఫుల్ డైలాగులు చెప్పించాడు దర్శకుడు. మిస్టర్ బచ్చన్ మాస్ మహా ట్రైలర్ పేరుతో విడుదల చేసిన ఈ వీడియో రెండు నిమిషాల ఇరవైఐదు సెకన్లు ఉంది. ఇందులో కమెడియన్ సత్య లుక్ వెరైటీ గా ఉంది అనే చెప్పాలి. ఆగస్ట్ 15 న మిస్టర్ బచ్చన్ తో పాటు రామ్ హీరో గా నటించిన డబుల్ ఇస్మార్ట్ కూడా విడుదల అవుతున్న విషయం తెలిసిందే. మిస్టర్ బచ్చన్ సినిమా ప్రీమియర్స్ ఆగస్ట్ 14 సాయంత్రం నుంచే ప్రారంభం కానున్నాయి. 

Tags:    

Similar News