అప్పుడే ఓటిటి లోకి

Update: 2024-09-07 11:32 GMT

Full Viewరవి తేజ కొత్త సినిమా విడుదల అయి నెల రోజులు కాకుండానే ఓటిటి లోకి వస్తోంది. భారీ అంచనాల మధ్య ఆగస్ట్ 15 న విడుదల అయిన మిస్టర్ బచ్చన్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మిశ్రమ స్పందలకే పరిమితం అయింది. ఇందులోని పాటలు మిస్టర్ బచ్చన్ పై భారీ అంచనాలు పెంచిన కూడా అవేమి బాక్స్ ఆఫీస్ వద్ద వర్క్ అవుట్ కాలేదు. ఈ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన భాగశ్రీ బోర్సే ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రైడ్ కు రీమేక్ గా దర్శకుడు హరీష్ శంకర్ ఈ సినిమాని తెరకెక్కించారు.

                                                   ఇప్పుడు మిస్టర్ బచ్చన్ సెప్టెంబర్ 12 నుంచి ప్రముఖ ఓటిటి నెట్ ఫ్లిక్స్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. తెలుగు తో పాటు తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంటుంది అని తెలిపారు. ఈ సినిమాలో రవి తేజ పవర్ ఫుల్ ఆదాయపన్ను శాఖ అధికారిగా నటించారు. బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయింది మిస్టర్ బచ్చన్ మరి ఓటిటి లో ఎలాంటి ఫలితాన్ని దక్కించుకుంటుందో వేచిచూడాల్సిందే.

Tags:    

Similar News