ఆహా లో స్ట్రీమింగ్

Update: 2026-06-15 10:40 GMT

టాలీవుడ్ లో రవి బాబు కు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన విలక్షణ నటుడే కాకుండా..విలక్షణ దర్శకుడు కూడా. కాకపోతే గత కొంత కాలంగా ఆయన సినిమా లు బాక్స్ ఆఫీస్ దగ్గర విజయాన్ని దక్కించుకోలేకపోతున్నాయి. చాలా గ్యాప్ తర్వాత ఆయన రేజర్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా మే 8 న విడుదల కాగా..బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ లో మితిమీరిన హింస కూడా ప్రేక్షకులను ఒకింత భయపెట్టింది అనే చెప్పొచ్చు. ట్రైలర్ లోనే ఈ సినిమాలో హింస ఎలా ఉండబోతుందో చూపించారు.

                           Full Viewఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా కేవలం మూడు కోట్ల రూపాయల లోపు మాత్రమే వసూళ్లు సాధించింది. బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయిన ఈ రేజర్ మూవీ ఇప్పుడు ఓటిటి లోకి వస్తోంది. జూన్ 19 నుంచి ఈ సినిమా ఆహా లో అందుబాటులో ఉంటుంది అని అధికారికంగా వెల్లడించారు. ఈ సినిమాలో తనీష్ అల్లాడి, ఇనయా సుల్తానా, బేబీ తేజల్ విఖ్యాతీ, బెనర్జీ లు కీలక పాత్రలు పోషించారు. రవి బాబు, దగ్గుబాటి సురేష్ బాబు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి రాజేష్ సంగీతం అందించారు. ఓటీటీ ప్రేక్షకులను ఈ సినిమా ఎంతవరకు ఆకట్టుకుంటుందో వేచిచూడాల్సిందే.

Tags:    

Similar News