విలక్షణ నటుడికి వెరైటీ పాత్ర

Update: 2021-05-25 13:42 GMT

టాలీవుడ్ లో విలక్షణ నటుడు రావు రమేష్.. ఆయన డెలాగ్ డెలివరి..నటన ఓ రేంజ్ లో ఉంటుందనే విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన తన సత్తా చాటేందుకు మరో వైరైటీతో పాత్రతో రాబోతున్నారు. అదే 'గూని బాబ్జీ'. శర్వానంద్, సిద్ధార్థ్‌ హీరోలుగా నటిస్తున్న సినిమా 'మహాసముద్రం' సినిమాలో ఆయన ఈ పాత్ర పోషిస్తున్నారు. మంగళవారం నాడు రావు రమేష్ పుట్టినరోజును పురస్కరించుకుని చిత్ర యూనిట్ ఈ లుక్ ను విడుదల చేసింది.

'ఆర్‌ఎక్స్‌ 100' ఫేమ్‌ అజయ్‌ భూపతి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో అదితి రావు హైదరి - అను ఇమ్మాన్యుయేల్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయ‌న పాత్ర వ్యంగ్యంగా సాగుతూ నెగెటివ్ ట‌చ్ ఉంటుంద‌ని సమాచారం. యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. అజయ్ సుంకర కో- ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.

Tags:    

Similar News