Full Viewదసరా బరిలోకి విజయదేవరకొండ కొత్త సినిమా వస్తోంది. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ తెరకెక్కిస్తున్న ‘రణబాలి’ మూవీలో విజయదేవరకొండకు జోడిగా రష్మిక మందన్న నటిస్తున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత వీళ్ళిద్దరూ కలిసి చేస్తున్న సినిమా ఇదే కావటంతో ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. వాస్తవానికి ‘రణబాలి’ మూవీ సెప్టెంబర్ 11 న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. రష్మిక కాలికి గాయం కావటంతో పాటు రకరకాల కారణాల వల్ల ఈ సినిమా విడుదల వాయిదా పడింది. చిత్ర యూనిట్ గురువారం నాడు ‘రణబాలి’ కొత్త విడుదల తేదీని ప్రకటించింది. దీని ప్రకారం ఈ మూవీ అక్టోబర్ 16 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

                            పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఇందులో ది మమ్మీ సినిమాలో నటించిన ఆర్నాల్డ్ విలన్ గా కనిపించనున్నారు. హీరో విజయ్, విలన్ ఆర్నాల్డ్ ల మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి అని దర్శకుడు రాహుల్ ఒక ఇంటర్వ్యూ లో వెల్లడించారు. దసరా సెలవులు టార్గెట్ చేసుకుని టాలీవుడ్ నుంచి పలు సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇప్పుడు అందులో విజయ్ కొత్త మూవీ ‘రణబాలి’ కూడా చేరింది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తుంటే...టి సిరీస్ సినిమాను సమర్పిస్తోంది.

Tags: