'ఆచార్య' సెట్ లోకి రామ్ చరణ్ ఎంట్రీ

Update: 2021-01-17 05:47 GMT
ఆచార్య సెట్ లోకి రామ్ చరణ్ ఎంట్రీ
  • whatsapp icon

కరోనా నుంచి కోలుకున్న హీరో రామ్ చరణ్ 'ఆచార్య' సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ సినిమాలో ఆయన పాత్రకు సంబంధించిన లుక్ ను చిత్ర యూనిట్ ఆదివారం నాడు విడుదల చేసింది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు నిర్మాణ కూడా రామ్ చరణ్ అన్న సంగతి తెలిసిందే. ఓ పక్క నిర్మాతగా వ్యవహరిస్తూ తండ్రి హీరోగా నటించే సినిమాలో రామ్ చరణ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు.

మెగా అభిమానుల్లో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. దీనికితోడు కొరటాల శివ దర్శకత్వం అన్నది కూడా మరో కీలక అంశంగా ఉంది. మా సిద్ధ సర్వం సిద్ధం అంటూ రామ్ చరణ్ పాత్ర పేరును కూడా వెల్లడించారు. ఈ సినిమాలో కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్ గా నటిస్తోంది.

Tags:    

Similar News