రామ్ చరణ్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా పెద్ది. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ దగ్గర దగ్గర 393 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది. గేమ్ ఛేంజర్ డిజాస్టర్ తర్వాత ఎలాగైనా హిట్ కొట్టాలనే టార్గెట్ తో రామ్ చరణ్ ఈ మూవీకి ఓకే చేశాడు...బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించిన ఫలితాన్ని దక్కించుకున్నాడు. ఓవర్సీస్ తో పాటు మరొకొన్ని కొన్ని చోట్ల నష్టాలు వచ్చినా కూడా ఓవరాల్ గా చూస్తే పెద్ది కలెక్షన్స్ రామ్ చరణ్ కు మంచి బూస్ట్ ఇచ్చాయి అనే చెప్పాలి. సానా బుచ్చి బాబు దర్శకత్వంలో తెరకెక్కిన పెద్ది మూవీ లో రామ్ చరణ్ కు జోడిగా జాన్వీ కపూర్ నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదల తర్వాత రామ్ చరణ్ యాక్షన్ కు ప్రేక్షకుల ముంచి పెద్ద ఎత్తున ప్రశంసలు రాగా..హీరోయిన్ జాన్వీ కపూర్ రోల్ పై అంతే స్థాయిలో విమర్శలు వచ్చాయి. చివరకు దర్శకుడు క్షమాపణ కూడా చెప్పి సినిమాలో కొన్ని సన్నివేశాలు తొలగించారు కూడా.