టాలీవుడ్ అయినా..బాలీవుడ్ అయినా పది కాలాలపాటు పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే ఫిట్ గా ఉండటం ఎంతో ముఖ్యం. అది హీరోలు అయినా..హీరోయిన్ లు అయినా. అందుకే వాళ్లు ఫిట్ నెస్ కు అంత ప్రాధాన్యత ఇస్తారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక సినిమా ఆర్ఆర్ఆర్ తోపాటు 'ఆచార్య' సినిమాలోనూ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. జిమ్ లో వర్కవుట్స్ అనంతరం కూర్చున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అదే ఈ ఫోటో.