రామ్ చరణ్ హీరోగా సంచలన దర్శకుడు శంకర్ తెరకెక్కించిన సినిమా గేమ్ ఛేంజర్. ఈ సినిమా టీజర్ నవంబర్ 9 న విడుదల కానుంది. దీపావళి సందర్భంగా చిత్ర యూనిట్ ఈ అప్డేట్ ఇస్తూ రామ్ చరణ్ న్యూ లుక్ ను విడుదల చేసింది. కొంత మందిని రైల్ పట్టాలపై పడుకోబెట్టి..ఆ పక్కన రామ్ చరణ్ కూర్చున్న మాస్ లుక్ ను విడుదల చేశారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కి అంటే జనవరి 10 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే. గేమ్ ఛేంజర్ సినిమాలో రామ్ చరణ్ కు జోడిగా కియారా అద్వానీ నటిస్తున్న విషయం తెలిసిందే. పలు వాయిదాలు పడిన ఈ సినిమా ఫలితంపై అందరిలో ఎంతో ఆసక్తి ఉంది అనే చెప్పాలి.