టాలీవుడ్ లో ఏడేళ్లు పూర్తి చేసుకున్న రకుల్

Update: 2020-11-29 06:02 GMT
టాలీవుడ్ లో ఏడేళ్లు పూర్తి చేసుకున్న రకుల్
  • whatsapp icon

రకుల్ ప్రీత్ సింగ్. ఒకప్పుడు టాలీవుడ్ లో గోల్డెన్ లెగ్ గా పేరుతెచ్చుకుంది. అయితే ఈ గోల్డెన్ లెగ్ టైటిల్ ఎక్కువ కాలం ఎవరికీ నిలవదు. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో అది మరీ స్పీడ్ గా మారిపోతుంది. అయితే రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లోకి అడుగుపెట్టి ఏడేళ్ళు పూర్తి చేసుకుంది. తెలుగు ప్రేక్షకులు ఎంతో అభిమానం, ప్రేమతో తనను ఆదరించారని..ఆ కారణంగానే తాను ఎంతో ఆనందంతో ఉన్నట్లు తెలిపారు.

ఢిల్లీ అమ్మాయిని అయిన తాను పక్కా తెలుగు అమ్మాయిగా మారిపోయానన్నారు. ఈ ప్రయాణంతో ఎంతో అందమైనదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తన డైరక్టర్లు, నిర్మాతలు, సహ నటులు, అభిమానులు తనను ప్రేమించిన వారందరికీ ధన్యవాదాలు అంటూ ఇన్ స్టాగ్రామ్ లో రాసుకొచ్చింది రకుల్. కుటుంబ సభ్యుల మద్దతు, మేనేజర్, టీమ్ లేకుండా ఈ ప్రయాణం సాధ్యంకాదన్నారు.

Tags:    

Similar News