అతను వస్తున్నాడు

Update: 2024-10-21 12:12 GMT

ప్రభాస్ ఫ్యాన్స్ ఇక పండగే . ఎందుకంటే అక్టోబర్ 23 న ఈ పాన్ ఇండియా హీరో పుట్టిన రోజు కావటంతో ప్రభాస్ కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించిన అప్ డేట్స్ వరస పెట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. రాజాసాబ్ తో పాటు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించే స్పిరిట్, సలార్ 2 ప్రాజెక్ట్ లు లైన్ లో ఉన్నాయి. తొలుత ఇవి పూర్తి అయితే కానీ...కొత్త ప్రాజెక్ట్ ల గురించే ఆలోచించే పరిస్థితిలో ప్రభాస్ ఉండడు అని చెప్పొచ్చు.

అక్టోబర్ 23 న అతను వస్తున్నాడు అన్నాడు అంటూ సూపర్ స్లిమ్ గా ఉన్న ప్రభాస్ న్యూ లుక్ ను రాజాసాబ్ చిత్ర యూనిట్ సోమవారం నాడు విడుదల చేసింది. రాజాసాబ్ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 10 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే. సందీప్ రెడ్డి వంగా కూడా ప్రభాస్ పుట్టిన రోజు సందర్బంగా తన ప్రాజెక్ట్ వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. మరి అక్టోబర్ 23 న ప్రభాస్ ఫ్యాన్స్ కు ఎన్ని సర్ప్రైజెస్ వస్తాయో చూడాలి. 

Tags:    

Similar News