రజని కాంత్ హిట్ మూవీ వెట్టయాన్ ఓటిటి డేట్ ఫిక్స్ అయింది. ఈ సినిమా లో రజనీ కాంత్ తో పాటు అమితాబ్ బచ్చన్, దగ్గుబాటి రానా లు కూడా కీలక పాత్రలు పోషించిన విషయం తెలిసిందే. టి. జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ నవంబర్ 8 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు తో పాటు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా ఇది అందుబాటులో ఉంటుంది అని అమెజాన్ ప్రైమ్ అధికారికంగా వెల్లడించింది.
పోలీస్ లు చేసే ఎన్ కౌంటర్ల లో జరిగే మానవ హక్కుల ఉల్లంఘన, విద్యావ్యాపారం వంటి కీలక అంశాలను టచ్ చేస్తూ దర్శకుడు జ్ఞానవేల్ ఈ సినిమాను ఆసక్తికరంగా మల్చటంలో సక్సెస్ సాధించారు. వెట్టయాన్ సినిమాలో ప్రముఖ మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ నటన సినిమాకే హై లైట్ గా నిలిచింది అని చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి వసూళ్లు సాధించిన ఈ సినిమా ఓటిటి లో ఎన్ని రికార్డు లు బద్దలు కొడుతుందో చూడాలి.