మందాకినిగా ప్రియాంక చోప్రా

Update: 2025-11-12 16:17 GMT

గుప్పిట మూసినంత కాలం గట్టిగా మూశారు. ఇప్పుడు ఓపెన్ చేశారు. వరసపెట్టి అప్ డేట్స్ ఇస్తూ పోతున్నారు. రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఎస్ఎస్ఎంబి 29 కు సంబంధించి చిత్ర యూనిట్ ఇందులోని పాత్రల న్యూ లుక్స్ విడుదల చేస్తూ పోతోంది. ఫస్ట్ ఈ సినిమా లో విలన్ గా నటిస్తున్న పృథ్విరాజ్ సుకుమారన్ పాత్ర కుంభ ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. బుధవారం నాడు ఈ సినిమాలో హీరోయిన్ ప్రియాంక చోప్రా న్యూ లుక్ ను విడుదల చేశారు. చీరకట్టుకుని..చేతిలో గన్ పట్టుకుని ఉన్న ప్రియాంక లుక్ ఆకట్టుకుంది. ఈ సినిమాలో ప్రియాంక మందాకిని పాత్రలో కనిపించనుంది అనే విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది.

                                               ఇక మిగిలింది మహేష్ బాబు లుక్ ఒక్కటే అని చెప్పాలి. నవంబర్ 15 న ఈ మూవీ ఈవెంట్ ను రామోజీ ఫిల్మ్ సిటీ లో భారీ ఎత్తున ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అదే రోజు మహేష్ బాబు లుక్ తో పాటు టీజర్ కూడా విడుదల చేసే అవకాశం ఉంది అనే అంచనాలు ఉన్నాయి. ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన దర్శకుడు రాజమౌళి ఆమె పై ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రపంచ వేదికపై భారతీయ సినిమా ను పునర్ నిర్వచించిన ప్రియాంక ఇప్పుడు దేశీ గర్ల్ గా వస్తోంది అని పేర్కొన్నారు.

Tags:    

Similar News