Full View'అరె. నీకు అంత బలుపేంటిరా. వీడిది బలుపు కాదు. దూల. తేడా ఏంటి బాబాయి. సీమ టపాకాయ్ పేలుతుంది అని తెలిసి కూడా చేత్తో పట్టుకోవటం బలుపు. వత్తి వెలిగిందో లేదో కంటి దగ్గర పెట్టుకుని చూడటం దూల' అంటూ కార్తికేయ, తనికెళ్ళ భరణిల మధ్య నడిచే డైలాగ్ లతో ప్రారంభం అయింది రాజావిక్రమార్క ట్రైలర్. కార్తికేయ, తాన్యా రవిచంద్రన్ జంటగా నటిస్తున్న ఈ సినిమా నవంబర్ 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
అందులో భాగంగానే చిత్ర యూనిట్ సోమవారం నాడు థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేసింది. నాని ఈ ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ సినిమాలో కార్తికేయ ఎన్ఐఏ ఆఫీసర్ గా నటించనున్నారు. టెర్రరిస్టుల దగ్గర స్వాధీనం చేసుకున్న బాంబులను చూస్తూ దివాళీ బాగా గ్రాండ్ గానే ప్లాన్ చేశావు అంటూ కార్తికేయ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది.