Full Viewప్రభాస్,పూజా హెగ్డెలు జంటగా నటించిన సినిమా 'రాధేశ్యామ్'. ఈ పాన్ ఇండియా సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని చిత్ర యూనిట్ ప్రత్యేక గ్లింప్స్ తోపాటు ప్రత్యేక లుక్ ను విడుదల చేసింది. పలు వాయిదాల అనంతరం ఈ సినిమా మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ప్రేమ, విధి మధ్య జరిగే పోరాటంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, పాటలు అంచనాలను మరింత పెంచాయి.