భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఐఎఫ్ఎఫ్ఐ) ఉత్సవాలు గోవాలో అట్టహాసంగా ప్రారంభం అయ్యాయి. తొలిసారి ఈ ఉత్సవాలను హైబ్రిడ్ పద్దతిలో నిర్వహిస్తున్నారు. వర్చువల్ పద్దతితోపాటు నేరుగా కూడా అతిధులను ఆహ్వానించారు. నవంబర్ 28 వరకూ సాగనున్నాయి. దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ నటీ, నటులు అందరూ ఈ ఉత్సవంలో పాల్గొంటున్నారు. కోవిడ్ తర్వాత గోవాలో జరుగుతున్న అతి పెద్ద ఉత్సవం కూడా ఇదే కావటం విశేషం.
అయితే దక్షిణ బారత పరిశ్రమ తరపున తనకు ఈ అంతర్జాతీయ చలనచిత్సోత్సవంలో స్టేజీపై ప్రదర్శన ఇచ్చే అవకాశం వచ్చిందని..దీన్ని ఎంతో గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొంది రాశీ ఖన్నా. ఈ ఫోటోను ఇన్ స్టాలో షేర్ చేసి భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం లో ప్రదర్శన ఇచ్చినట్లు వెల్లడించింది రాశీ ఖన్నా.