తొమ్మిది భాషల్లో విడుదల

Update: 2026-04-08 06:39 GMT

అల్లు అర్జున్ హీరో గా డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్న మూవీ టైటిల్ ను చిత్ర యూనిట్ వెల్లడించింది. బుధవారం అల్లు అర్జున్ పుట్టిన రోజు కావటంతో ఆయన ఫాన్స్ కు ట్రీట్ ఇచ్చేందుకు టైటిల్ తో పాటు అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశారు. ఈ సినిమాకు రాకా అనే పేరు పెట్టారు. ఇది అల్లు అర్జున్ 22 వ సినిమా అయితే...దర్శకుడు అట్లీ ఆరవ సినిమా. పుష్ప రెండు పార్ట్ ల తర్వాత అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిలో తన ఇమేజ్ పెంచుకున్నాడు. ముఖ్యంగా పుష్ప 2 సినిమా వసూళ్లు బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్మురేపిన సంగతి తెలిసిందే.

                                  Full Viewదీంతో ఇప్పుడు ఈ కొత్త సినిమా పై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రాకా మూవీ ఫస్ట్ లుక్ చూస్తే అల్లు అర్జున్ ఈ సినిమాతో మరో కొత్త ప్రయోగం చేస్తున్నట్లు కనిపిస్తోంది అనే చర్చ సాగుతోంది. మొత్తం తొమ్మిది భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. అంచనాలకు అందని రీతిలో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జోడిగా దీపికా దీపికా పడుకొణె నటిస్తున్న విషయం తెలిసిందే.

Tags:    

Similar News