ఎంత ప్రతిష్టాత్మక సినిమా విషయంలో అయినా అందరి అభిప్రాయాలూ ఓకేలా ఉండవు. ఒక్కొక్కరికి సినిమా ఒక్కోలా అన్పిస్తుంది. కొంత మందికి నచ్చుతుంది..మరికొంత మందికి నచ్చకపోవచ్చు కూడా. ఏ సినిమా కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ విషయంలోనూ అదే జరిగింది. ఈ సినిమా కొంత మందికి నచ్చింది. మరికొంత మందికి నచ్చలేదు. ఎవరి అభిప్రాయాలు వారు సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ విమర్శలపై వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ) వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన వరస ట్వీట్లు చేశారు. ఇవి ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. పీవీపీ ట్వీట్ల సారాంశం...'కళకు కులం పిచ్చి అంటించే కొడుకులకు, కుత్తుక కొయ్యాలి.
జాతి గర్వించే కధలు, దేశభక్తితో నెత్తురు ఉడికించే సినిమాను చూసి శభాష్ అనాలి..మన తెలుగు వాడు, ఒక జాతీయ సంపద అయినందుకు మనవాడని ఆనంద పడాలి. నాకు ఈ సినిమా హీరోలతో, దర్శక నిర్మాతలతో ఇప్పుడు, మున్ముందున వ్యాపారం లేదు..కాస్త తెలుగోడిగా, గర్వపడిండిరా కొడకల్లారా. జీవితంలో ఒక షాట్ తియ్యలేదు, ఒక్క రోజు షూటింగ్లో నిలబడింది లేదు.. కానీ అందరికి సినిమాలు తీయ్యడంలో క్లాసులు పీకుతారు.. సినీప్రపంచంలో భయపడుతూ బ్రతికేవాళ్లందరు, మీ కష్టాన్ని అపహాస్యం చేసేవాళ్ళ మీద తిరగపడండి' ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ప్రధానంగా ఆయన ఈ సినిమాపై రివ్యూలు రాసిన వారిని టార్గెట్ చేశారు.