అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా నటిస్తున్న సినిమా 'పుష్ప'. ఈ సినిమా రెండు భారీ షెడ్యూల్స్ ను పూర్తి చేసుకుంది. ఈ రెండూ కూడా రంపచోడవరం, మారేడుమిల్లి అటవీ ప్రాంతాల్లో జరిగాయి. ఈ షూటింగ్ కు సహకరించిన వారందరికీ చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా ధన్యవాదాలు తెలిపింది.
సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలుగా ఉన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేఫథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. తాజాగా విడుదల చేసిన అల్లు అర్జున్ లుక్ కూడా ఇదే విషయాన్ని ధృవపర్చింది.