పుష్ప ట్రైలర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన అల్లు అర్జున్ అభిమానులకు చిత్ర యూనిట్ షాక్ ఇచ్చింది. ఈ ట్రైలర్ సోమవారం సాయంత్రం ఆరు గంటల మూడు నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ముందే ముహుర్తం ప్రకటించారు. కానీ ఊహించని సాంకేతిక కారణాల వల్ల ట్రైలర్ ను ముందు ప్రకటించినట్లుగా ఆరు గంటలకు విడుదల చేయలేకపోతున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. అయితే ఆలశ్యం అయినా సోమవారం నాడే విడుదల చేస్తారా? లేక వాయిదా వేస్తారా అన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.
ఈ సినిమా ద్వారా తొలిసారి అల్లు అర్జున్, రష్మిక మందన జోడీకడితే..సుకుమార్, అల్లు అర్జున్ లకు ఇది హ్యాట్రిక్ సినిమా. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలు..ఇందులోని పాత్రదారుల లుక్స్ హైలెట్ గా నిలిచాయి. ఎర్రచందం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా కోసం అల్లు అర్జున్ గతంలో ఎన్నడూలేని రీతిలో ఊరమాస్ లుక్ లోకి మారారు. పాటల్లోనూ అందుకు అనుగుణంగా ప్రత్యేక స్టెప్స్ తో ఆకట్టుకుంటున్నాడు. డిసెంబర్ 17న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే. ప్రముఖ సంస్థ మైత్రీమూవీ మేకర్స్ ఈ సినిమా నిర్మించింది.