Full Viewపుష్ప సినిమా నుంచి చివరి పాట కూడా వచ్చింది. ఈ పాటకు ఓ ప్రత్యేకత ఉంది.ఈ ఐటెం సాంగ్ లో సమంత హంగామా చేసిన విషయం తెలిసిందే. చిత్ర యూనిట్ శుక్రవారం సాయంత్రం ఈ లిరికల్ సాంగ్ ను విడుదల చేసింది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న క్రేజీ మూవీ పుష్పలో 'ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా.. అంటూ హంగామా చేసింది.
'మీ మగబుద్ధే వంకరబుద్ధి..' అంటూ సాగింది ఈ పాట. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న సినిమా డిసెంబర్ 17న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే. అయితే సినిమాలోని ఇతర పాటలతో పోలిస్తే సమంత ప్రత్యేక గీతం కిక్ ఇచ్చేలా లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.