'పుష్పరాజ్' న్యూలుక్ విడుదల

Update: 2021-04-08 11:07 GMT

అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా బుధవారం నాడు ఆయన పాత్ర పరిచయ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. 20 గంటల వ్యవధిలో ఇది 18 మిలియన్ల వ్యూస్ సాధించింది. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టిన రోజు కావటంతో చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బైక్ పై కూర్చుని ఉన్న అల్లు అర్జున్ న్యూలుక్ ను విడుదల చేసింది. ఇది కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటోంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది.

Tags:    

Similar News