Full Viewఆలశ్యంగా వచ్చినా అదిరేలా వచ్చింది. పుష్ప సినిమా ట్రైలర్ దుమ్మురేపుతోంది. పవర్ ఫుల్ డైలాగ్ లతో ఆకట్టుకునేలా ఉంది ఈ ట్రైలర్. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా..ఫైర్ అంటూ అల్లు అర్జున్ చిత్తూరు యాసలో చెప్పే డైలాగ్ ఇందులో హైలెట్ గా ఉంది. ఈ లోకం నీకు తుపాకీ ఇచ్చింది..నాకు గొడ్డలి ఇచ్చింది. ఎవడి యుద్ధం వాడిది. భూ మండలంలో ఏడా పెరగని చెట్టు మన శేషాచలం అడవుల్లో పెరుగుతుండాది అనే డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. ఇక్కడ నుంచే వేల కోట్ల సరుకు విదేశాలకు స్మగ్లింగ్ అవుతోంది. గోల్డ్ రా ఇది...భూమిపై పెరిగే బంగారం. పేరు ఎర్ర చందనం అంటూ సాగుతుంది. ట్రైలర్ చూస్తే ఇందులో అల్లు అర్జున్ ద్విపాత్రిభియనం చేసినట్లు కన్పిస్తోంది. అల్లు అర్జున్, రష్మిక మందనల మధ్య వచ్చే సన్నివేశాలు కూడా ఆకట్టుకున్నాయి.
వాస్తవానికి ఈ ట్రైలర్ సోమవారం సాయంత్రం ఆరు గంటల మూడు నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ముందే ముహుర్తం ప్రకటించారు. కానీ ఊహించని సాంకేతిక కారణాల వల్ల ట్రైలర్ ను ఆలశ్యంగా విడుదల చేశారు. ఈ సినిమా ద్వారా తొలిసారి అల్లు అర్జున్, రష్మిక మందన జోడీకడితే..సుకుమార్, అల్లు అర్జున్ లకు ఇది హ్యాట్రిక్ సినిమా. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలు..ఇందులోని పాత్రదారుల లుక్స్ హైలెట్ గా నిలిచాయి. పాటల్లోనూ అందుకు అనుగుణంగా ప్రత్యేక స్టెప్స్ తో ఆకట్టుకుంటున్నాడు. డిసెంబర్ 17న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే. ప్రముఖ సంస్థ మైత్రీమూవీ మేకర్స్ ఈ సినిమా నిర్మించింది.