సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప ద రైజ్ తొలి భాగం సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్లు చాలా ముందుగానే ప్రకటించారు. రెండు పార్టులు అయినా కూడా తొలి భాగం ఏకంగా మూడు గంటల నిడివి ఉండటం విశేషం. రన్ టైమ్ 179.51 నిమిషాలుగా సెన్సార్ సర్టిఫికెట్ లో ఉంది. అల్లు అర్జున్, సుకుమార్ లది ఇది హ్యాట్రిక్ సినిమా కావటం ఒకెత్తు అయితే..అల్లు అర్జున్ గతంలో ఎన్నడూలేని రీతిలో ఊరమాస్ క్యారెక్టర్ లో కన్పించనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దీనిపై భారీ హైప్ క్రియేట్ అయింది.
పాటలు అన్నీ ఆకట్టుకునేలా ఉండగా..ట్రైలర్ కూడా సినిమాపై అంచనాలను ఓ రేంజ్ కు తీసుకెళ్లింది. ఆదివారం నాడు జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన దర్శకులు రాజమౌళి, కొరటాల శివ చేసిన వ్యాఖ్యలు కూడా అభిమానుల్లో మరింత ఉత్సాహన్ని నింపాయి. ఈ క్యారెక్టర్ కోసం అల్లు అర్జున్ చాలా కష్టపడ్డాడని వీరు ప్రశంసలు కురిపించారు. యూట్యూబ్ లో పుష్పకు సంబంధించి ఏమి విడుదలైన కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. మరి సినిమా విడుదల అయిన తర్వాత ఎన్ని రికార్డులు నమోదు అవుతాయో వేచిచూడాల్సిందే.