'పుష్ప' సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. డిసెంబర్ 17న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతున్న తరుణంలో ఓటీటీ తేదీ ప్రకటించటం సంచలనంగా మారింది. అది కూడా జనవరి 7 నుంచే ఇది అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది. సంక్రాంతికి విడుదల కావాల్సిన ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ వంటి పాన్ ఇండియా సినిమాలు వాయిదా పడ్డాయి. దీంతో ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకే ఓటీటీలోనూ దుమ్మురేపేందుకు ఈ తేదీని ఎంచుకున్నట్లు భావిస్తున్నారు.
మరి అల్లు అర్జున్, రష్మిక మందనల సినిమా అమెజాన్ లో ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో వేచిచూడాల్సిందే. ప్రపంచ వ్యాప్తంగా పుష్ఫ చిత్రం ఇప్పటికే 306 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. జనవరి 7న 'పుష్ప' చిత్రం హిందీ తప్ప అన్ని దక్షిణాది భాషల్లోనూ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కాబోతోంది. ఈ విషయాన్ని ట్విట్టర్ లో అఫీషియల్ గా ప్రకటించారు. ఇంత తొందరగా ఈ సినిమా ఓటీటీలోకి రానుండడం అభిమానుల్ని ఖుషీ చేస్తోంది.