Full Viewఅల్లు అర్జున్ కొత్త సినిమా పుష్ప సందడి ఆగస్టు 13 నుంచి ప్రారంభం కానుంది. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ సింగిల్ ను ఆ రోజే విడుదల చేయనున్నారు.. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ సోమవారం నాడు వెల్లడించింది. ఐదు భాషల్లో ఈ పాటను విడుదల కానుంది. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ పాటకు సంబంధించిన ప్రకటనలో ఈ విషయాలను వెల్లడించారు. 'దాక్కో దాక్కో మేక..పులి వచ్చి కొరుకుద్ది పీక' అంటూ సాగే చరణం ఆకట్టుకునేలా ఉంది. దేవీ శ్రీ ప్రసాద్ తన మ్యూజిక్ తో మరో సారి మ్యాజిక్ చేయటానికి రెడీ అవుతున్నారు.
సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు జోడీగా రష్మిక మందన నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ. ఇదిలా ఉంటే గత కొంత కాలంగా తెలుగు సినిమాల మార్కెట్ పెరుగుతోంది. అందుకే ఇప్పుడు చాలా వరకూ సినిమాలు అన్నీ పలు భాషల్లో కూడా విడుదల చేయనున్నారు. బాహుబలి సినిమా నుంచి ఈ ట్రెండ్ ప్రారంభం అయింది. రాబోయే రోజుల్లో పెద్ద హీరోల సినిమాలు అన్నీ కూడా ఇదే బాటపట్టేలా ఉన్నాయి.