పుష్ప రాజ్ పాలన ...50 రోజుల్లో

Update: 2024-10-17 09:37 GMT

Full Viewఈ ఏడాది చివరి నెలలో సందడి అంతా పుష్పరాజుదే. అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న పుష్ప 2 సినిమా డిసెంబర్ ఆరు న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదలకు సరిగ్గా ఇంకా 50 రోజుల సమయం ఉంది. దీంతో చిత్ర యూనిట్ గురువారం నాడు పుష్ప పాలన స్టార్ట్ కావటానికి ఇంకా 50 రోజుల సమయం మాత్రమే ఉంది అంటూ అల్లు అర్జున్ న్యూ స్టైలిష్ లుక్ ను విడుదల చేసింది. బాక్స్ ఆఫీస్ వద్ద పుష్ప 2 సినిమా కొత్త రికార్డు లు క్రియేట్ చేసేలా గత కొన్ని రోజులుగా ఈ సినిమాపై హైప్ ఒక రేంజ్ కు వెళుతుంది.

                                          ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ హాఫ్ పనులు అన్ని పూర్తికాగా ..టాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖులు ఈ సినిమా అదిరిపోయేలా ఉంది అని స్పష్టం చేస్తున్నారు. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. అదే సమయంలో తొలిరోజే తమ హీరో సినిమా రికార్డు వసూళ్లు సాధిస్తుంది అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే విడుదల అయిన పుష్ప 2 సాంగ్స్ యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. పుష్ప ఫస్ట్ పార్ట్ దేశ వ్యాప్తంగా సంచలన విజయాన్ని దక్కించుకోవటంతో ఇప్పుడు పుష్ప 2 కోసం సినిమా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News