Full Viewఎంతో హైప్ వచ్చిన ప్రాజెక్ట్ కె సినిమా కు సంబంధించి చిత్ర యూనిట్ ఇటీవల విడుదల చేసిన హీరో ప్రభాస్ ఫస్ట్ లుక్ అటు అయన ఫాన్స్ తో పాటు సినీ అభిమానులను కూడా నిరాశపరిచింది అనే చెప్పాలి. అయితే అమెరికా వేదికగా జరుగుతున్న కామిక్ కాన్ ఈవెంట్ లో విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్స్ మాత్రం ఫస్ట్ లుక్ డ్యామేజ్ ను కంట్రోల్ చేసింది అనే చెప్పాలి. ప్రపంచాన్ని చీకటి కమ్మేసినప్పుడు ఒక శక్తి వస్తుంది అంటూ చూపించే క్రమంలో హీరో ప్రభాస్ ఎంట్రీ ఉంటుంది ఇందులో. ఆ సమయంలో ఒక భారీ చేయి కుప్పకూలి పోతుంది. ఆ సమయంలోనే వాట్ ఈజ్ ప్రాజెక్ట్ కె అనే ప్రశ్నతో గ్లింప్స్ ను ముగిస్తారు. ఈ సినిమాకు కల్కి 2898 ఏడీ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్, హాలీవుడ్‌కు ధీటైన గ్రాఫిక్స్ హంగులతో విజువల్ ఫీస్ట్‌గా ఈ ఫస్ట్ గ్లింప్స్ అభిమానులను మెస్మరైజ్ చేస్తున్నాయి. కొందరు దుష్టశక్తులు ప్రజలను బందీలను చేయడం, ఆ ప్రజలు పడుతోన్న బాధలను ఫస్ట్ గ్లింప్స్ వీడియో ఆరంభంలో చూపించారు.ఆ ప్రజలను కాపాడటానికి ఉద్భవించిన సూపర్ హీరోగా ప్రభాస్ ఎంట్రీ ఇచ్చిన సీన్ ఫస్ట్ గ్లింప్స్‌కు హైలైట్‌గా నిలిచింది.
ఈ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్‌లో ప్రభాస్‌తో పాటు కమల్‌హాసన్, దర్శకుడు నాగ్ అశ్విన్, నిర్మాత అశ్వనీదత్ పాల్గొన్నారు. ఇండియన్ సినీ చరిత్రలోనే అత్యధిక బడ్జెట్ మూవీస్‌లో ఒకటిగా దాదాపు ఆరు వందల కోట్ల బడ్జెట్‌తో ప్రాజెక్ట్ కే మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో కమల్‌హాసన్‌తో పాటు బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలను పోషిస్తున్నారు. ప్రభాస్‌కు జోడీగా దీపికా పడుకోణ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీతోనే దీపికా పడుకోణ్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. మహానటి తర్వాత దాదాపు ఐదేళ్ల విరామం అనంతరం నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తోన్న మూవీ ఇది. వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వనీదత్ ఈ మూవీని నిర్మిస్తున్నారు.