ప్రభాస్ కు కాలం కలసి రావటం లేదా?

Update: 2023-07-19 14:26 GMT

Full Viewఅసలే హీరో ప్రభాస్ ను ఆదిపురుష్ ప్రభావం వెంటాడుతోంది. దీన్ని పక్కన పెట్టి ఈ పాన్ ఇండియా హీరో సలార్, ప్రాజెక్ట్ కె లపై ఫోకస్ పెట్టాడు. ఈ తరుణంలో చిత్ర యూనిట్ బుధవారం నాడు ప్రాజెక్ట్ కె సినిమా కు సంబంధించి హీరో ప్రభాస్ ఫస్ట్ లుక్ విడుదల చేసింది గత కొన్ని రోజులుగా చిత్ర యూనిట్ చెపుతూ వస్తున్న విషయాలతో దీనిపై హైప్ ఒక రేంజ్ కు వెళ్ళింది. కానీ పెరిగిన ఈ హైప్ ను అందుకోవడంలో ప్రాజెక్ట్ కె ఫస్ట్ లుక్ అందుకోలేక పోయింది. చివరకు ప్రభాస్ ఫాన్స్ కూడా ఇది ఫ్యాన్ మేడ్ పోస్టరా..లేక చిత్ర యూనిట్ విడుదల చేసిందా అని చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి కొంత మంది అయితే హాలీవుడ్ సినిమా ఐరన్ మ్యాన్ సినిమా లుక్ తరహాలో ఉంది అంటూ కామెంట్ చేస్తున్నాడు. మొత్తం మీద చూస్తే ప్రభాస్ ఫస్ట్ లుక్ ఈ సినిమాకు సంబంధించి పాజిటివ్ వైబ్రేషన్స్ తీసుకురావటంలో విఫలం అయింది అనే చెప్పాలి.

                                       దీంతో చాలా మంది ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఫస్ట్ లుక్ లోనే దెబ్బేసారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అమెరికాలో ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీ గా ఉన్న చిత్ర యూనిట్ ఇప్పటికే హీరోయిన్ దీపికా పడుకొనే లుక్ కూడా విడుదల చేసింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను వైజయంతి మూవీస్ నిర్మిస్తోంది. అమెరికా లో జరిగే కామిక్ కాన్ ఈవెంట్ లో పాల్గొంటున్న తొలి భారతీయ సినిమాగా ప్రాజెక్ట్ కె నిలవనుంది. ఈ సినిమా కు సంబదించిన టైటిల్ తో పాటు ఫస్ట్ గ్లింప్స్ ను అమెరికా వేదికగా విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ కు జోడిగా దీపికా పడుకొనే నటిస్తుంటే..ఇతర కీలక పాత్రల్లో దిగ్గజ నటులు అమితాబ్ , కమల్ హాసన్ లు నటిస్తున్న విషయం తెలిసిందే.

Tags:    

Similar News