నిర్మాత నాగవంశీ ప్రేక్షకులపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పారు. ఇటీవల డీజె టిల్లు సినిమా గురించి మీడియాతో మాట్లాడుతూ ఈ లెక్కలు.. అన్నీ మనలాంటి మేథావులకు కావాలి కానీ..ఆడియెన్స్ కు అక్కర్లేదు. వాడు ఇచ్చిన 150 రూపాయలకు 1500 నవ్వించాం చాలు. వాడు హ్యాపీ అంటూ స్పందించారు. ప్రేక్షకులపై ఇలా అనుచిత వ్యాఖ్యలు చేయటం దుమారం రేపింది. దీనిపై ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. 'ప్రేక్షకులు అంటే మాకెంతో గౌరవం. ఏ నిర్మాణ సంస్థకు అయినా బలం.
ప్రేక్షకులు పెట్టే విలువైన డబ్బుకు మించిన వినోదం అందించామన్న ఆనందంలో డీజే టిల్లు విడుదలైన రోజు మీడియాతో మాట్లాడుతూ అన్న మాటలు ప్రేక్షకులకు ఇబ్బంది కలిగించాయన్న వార్తలు తెలిసి తెలిసి బాధపడ్డాను. ప్రేక్షకులను ఏకవచనంతో సంభోదిస్తూ మాట్లాడటం,, వారిని సోదరులుగా భావించటం వల్లే. అయినా వారి మనసు నొచ్చుకోవటం పట్ల క్షంతవ్వుడిని. ముందుగా చెప్పినట్లే ఎప్పటికీ ప్రేక్షకులు అంటే మాకెంతో గౌరవం, వారే మా బలం ' అంటూ ట్వీట్ చేశారు.