మెగాస్టార్ చిరంజీవితో ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ సమావేశం అయ్యారు. ఈ భేటీలో హీరో రామ్ చరణ్ తోపాటు ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య కూడా పాల్గొన్నారు. చిరంజీవితో భేటీ అయిన ఫోటోలను ప్రశాంత్ నీల్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. తనకు చిరంజీవి మంచి ఆతిథ్యం ఇచ్చారని...ధన్యవాదాలు తెలిపారు. చిరంజీవితో భేటీ కావటం తన చిన్న నాటి కల అని వ్యాఖ్యానించారు. కెజీఎఫ్ సినిమాతో ప్రశాంత్ నీల్ పేరు మారుమోగిపోయిన విషయం తెలిసిందే.
ఆయన ప్రస్తుతం తెలుగులో ప్రభాస్ తో కలసి సాలార్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ భేటీ పూర్తిగా మర్యాదపూర్వక భేటీనేనా..లేక ఏమైనా ప్రాజెక్టులపై చర్చలు జరిగాయా అన్న విషయం తేలాల్సి ఉంది. ఇందులో దానయ్య కూడా పాల్గొనటంతో నూతన ప్రాజెక్టులపై కూడా చర్చించి ఉంటారని పరిశ్రమ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అయితే అది ఎవరితో ఉంటుంది..ఎప్పుడు ఉంటుంది అన్న విషయం తేలాలంటే కొంత కాలం వేచిచూడాల్సిందే.