ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ గాయపడ్డారు. చెన్నయ్ లో జరుగుతున్న షూటింగ్ లో ఆయన ప్రమాదం బారినపడ్డారు. హీరో ధనుష్ సినిమా షూటింగ్ లో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. అయితే ఈ అంశంపై ట్విట్టర్ వేదికగా ప్రకాష్ రాజ్ స్పందించారు. కిందపడిపోవటంతో చిన్న ఫ్రాక్చర్ అయిందని..తన మిత్రుడు, డాక్టర్ గురవారెడ్డి సురక్షితమైన చేతుల్లో ఉండేందుకు హైదరాబాద్ వస్తున్నట్లు వెల్లడించారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.తాను బాగానే ఉన్నట్లు తెలిపారు. కొద్ది రోజుల క్రితం ఆయన మా అధ్యక్ష్య ఎన్నికల్లో పోటీచేయనున్నట్లు ప్రకటించారు. అంతే కాదు తన టీమ్ తో సహా మీడియా ముందుకు వచ్చారు.