సొంత నిర్మాణ సంస్థలో

Update: 2026-07-06 07:30 GMT

ప్రదీప్ రంగనాథన్ చేసింది తక్కువ సినిమాలే అయినా యువతలో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఆయన తాజా సినిమా లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. సినిమా కాన్సెప్ట్ ఆకట్టుకునేలా ఉన్నా కూడా తెరకెక్కించిన విధానంలో లోపాలు ఉండటంతో ఇది ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు. ఇప్పుడు ప్రదీప్ రంగనాథన్ ఒక భారీ టీం తో కొత్త సినిమాను ప్రకటించాడు. ఈ సినిమాలో దర్శకుడు అశ్వత్ మరిముత్తు కూడా ఒక పాత్రలో నటించనున్నారు. ఇందులో మమిత బైజు హీరోయిన్ గా నటించనుంది. అనామిక మహి అనే మరో నటిని ఈ సినిమా ద్వారా పరిచయం చేయబోతున్నారు. ఈ మూవీ లో శివాజీ శొంఠినేని కీలక పాత్రలో కనిపించబోతున్నారు.Full View

                                 ఈ సినిమాను ఏకంగా ఆరుగురి దర్శకత్వంలో కూడిన ఒక టీం తెరకెక్కనుంది. దీంతో ఈ కాన్సెప్ట్ ను టీం పీఆర్ ది ఆల్ఫా యూనిట్ గా పిలుస్తున్నట్లు వెల్లడించారు. ఈ సినిమాకు కథ అందించటంతో పాటు ప్రొడ్యూసర్ గా కూడా హీరో ప్రదీప్ రంగనాథన్ వ్యవహరించనున్నారు. ఈ మూవీ కాన్సెప్ట్ వీడియో ను చిత్ర యూనిట్ సోమవారం నాడు విడుదల చేసింది. ఈ సినిమా తెలుగు తో పాటు తమిళ్, మలయాళం భాషల్లో విడుదల కానుంది. వెరైటీ కాన్సెప్ట్ తో ప్రదీప్ రంగనాథన్ తన సొంత బ్యానర్ పై ఒక సినిమాను నిర్మించనుండటంతో దీనిపై ఇప్పుడు అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ సినిమాకు సాయి అభయంకర్ మ్యూజిక్ అందిస్తున్నారు. 

Tags:    

Similar News