ప్రభాస్ 'సలార్' సర్ ప్రైజ్

Update: 2021-02-28 10:47 GMT

ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక సినిమా 'సలార్'. చిత్ర యూనిట్ ఆదివారం నాడు ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించింది. 2022 ఏప్రిల్ 14న ఈ మూవీ విడుదల కానుంది. కెజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్నఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా శృతిహాసన్ నటిస్తోంది. 150 కోట్ల రూపాయల బడ్జెట్ తో సినిమా తెరెకెక్కిస్తున్నట్లు సమాచారం. కొద్ది రోజుల క్రితం సింగరేణి బొగ్గు గనుల్లో ఈ సినిమా షూటింగ్ సాగిన విషయం తెలిసిందే. 

Tags:    

Similar News