ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో

Update: 2025-12-17 16:25 GMT

టాలీవుడ్ లో కీలక సినిమాలు అన్ని ఇప్పుడు ప్రీమియర్ షోస్ బాటపడుతున్నాయి. ముఖ్యంగా భారీ బడ్జెట్ సినిమాలతో పాటు కంటెంట్ పై నమ్మకం ఉన్న వాళ్ళు కూడా సినిమా విడుదలకు ముందు రోజే ప్రీమియర్స్ వేస్తున్నారు. సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమాల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న మూవీల్లో పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన రాజాసాబ్ మూవీ ఉంది. ఈ సినిమాకు సంబంధించి చిత్ర యూనిట్ బుధవారం నాడు ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది. అదేంటి అంటే రాజాసాబ్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా జనవరి 9 న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే జనవరి 8 నే స్పెషల్ ప్రీమియర్స్ వేయనున్నట్లు నిర్మాత టి జీ విశ్వప్రసాద్ అధికారికంగా వెల్లడించారు.

                                             బుధవారం హైదరాబాద్ లో సహనా సహనా సాంగ్ విడుదల కార్యక్రమంలో ఆయన ఈ విషయం వెల్లడించారు. త్వరలోనే హైదరాబాద్ లో ఓపెన్ గ్రౌండ్స్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. త్వరలోనే డేట్ అనౌన్స్ చేస్తామన్నారు. దర్శకుడు మారుతీ తెరకెక్కించిన ఈ మూవీ పై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రొమాంటిక్‌ కామెడీ హారర్‌ మూవీగా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్‌ కు జోడిగా నిధి అగర్వాల్, మాళవికా మోహనన్‌, రిద్ధి కుమార్‌ లు నటించారు. ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.

Tags:    

Similar News