సర్ప్రైజ్ లుక్

Update: 2024-10-23 13:38 GMT

Full Viewదర్శకుడు మారుతి ప్రభాస్ ఫ్యాన్స్ కు మంచి సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ పాన్ ఇండియా హీరో ను ఇంతకు ముందు ఎన్నడూ చూడని లుక్ లో చూపించారు. కామెడీ, హారర్ మిక్స్ గా రాజాసాబ్ సినిమాను దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో ఇమేజ్ పరంగా ఎక్కడికో వెళ్లిన ప్రభాస్ ఈ సినిమాకు ఓకే చేశారు అంటే కథలో ఎంత కొత్తదనం ఉంటే అంగీకరించారో అన్న చర్చ టాలీవుడ్ వర్గాల్లో సాగుతోంది.

                                        చిత్ర యూనిట్ కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్న విషయం తెలిసిందే. రాజాసాబ్ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ పదిన ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రభాస్ చేతిలో రాజాసాబ్ సినిమాతో పాటు స్పిరిట్, సలార్ 2 లు లైన్ లో ఉన్నాయి. ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా రాజాసాబ్ చిత్ర యూనిట్ మోషన్ పోస్టర్ ను విడుదల చేసింది. ఇది ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రభాస్ తాజా సినిమా కల్కి బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు వసూళ్లు సాధించిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News