బాహుబలి ప్రభాస్ ను చూశారు. ఆదిపురుష్ ప్రభాస్...సలార్ ప్రభాస్. ఇప్పుడు ప్రాజెక్ట్ కె ప్రభాస్ వచ్చారు. ప్రస్తుతం అమెరికాలో ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీ గా ఉన్న చిత్ర యూనిట్ ఈ సినిమా కు సంబంధించి హీరో ప్రభాస్ ఫస్ట్ లుక్ ను బుధవారం నాడు విడుదల చేసింది. ఇప్పటికే హీరోయిన్ దీపికా పడుకొనే లుక్ కూడా విడుదల అయినా విషయం తెలిసిందే. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను వైజయంతి మూవీస్ నిర్మిస్తోంది. ప్రాజెక్ట్ కె సినిమా పై పెద్ద ఎత్తున అంచనాలు ఉన్నాయి. సూపర్ హీరో లాగా డిజైన్ చేసిన ఈ లుక్ పై ప్రభాస్ అభిమానుల్లో కూడా మిశ్రమ స్పందన వ్యక్తం అవుతోంది.
కొంత మందికి ఇది నచ్చగా మరికొంత అభిమానులు పెదవి విరుస్తున్నారు. అమెరికా లో జరిగే కామిక్ కాన్ ఈవెంట్ లో పాల్గొంటున్న తొలి భారతీయ సినిమాగా ప్రాజెక్ట్ కె నిలవనుంది. ఈ సినిమా కు సంబదించిన టైటిల్ తో పాటు ఫస్ట్ గ్లింప్స్ ను అమెరికా వేదికగా విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ కు జోడిగా దీపికా పడుకొనే నటిస్తుంటే..ఇతర కీలక పాత్రల్లో దిగ్గజ నటులు అమితాబ్ , కమల్ హాసన్ లు నటిస్తున్న విషయం తెలిసిందే.