టాప్ హీరోయిన్ల కంటే ఎక్కువ మొత్తం

Update: 2024-01-23 12:06 GMT

Full Viewసినిమాల్లో బాడీ డబల్ కాన్సెప్ట్ చాలా మంది చూసే ఉంటారు. తెలుగు సినిమాల్లో కూడా ఇలాంటి పాత్రలు ఉన్నవి ఎన్నో వచ్చాయి. అయితే ఇప్పుడు పాన్ ఇండియా హీరో ప్రభాస్ కు సంబందించిన ఒక ఆసక్తికర వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. బాహుబలి దగ్గర నుంచి ప్రభాస్ చేస్తున్న సినిమాలు అన్నీ ఎక్కువగా యాక్షన్ సినిమాలే. ఇందులో ఎంతో రిస్క్ ఉండే సన్నివేశాలు కూడా ఉంటాయి. అయితే ఇలాంటి వాటిలో కొన్నింటిని బాడీ డబల్ పాత్రదారులుతో చేయించుతారు అని..అన్ని హీరో చేయటం కూడా సాధ్యం కాదు అని చెపుతున్నారు. ఇక్కడ ఇంటరెస్టింగ్ విషయం ఏమిటి అంటే ప్రభాస్ బాడీ డబల్ పాత్రధారి ఒక్కో సినిమాకు ఎనిమిది నుంచి తొమ్మిది కోట్ల రూపాయలు ఛార్జ్ చేస్తాడని ఒక ప్రముఖ టాలీవుడ్ వెబ్ సైట్ వెల్లడించింది.

ఎందుకంటే ఇందులో ఎన్నో రిస్కు లు ఇమిడి ఉంటాయి కాబట్టి అత్యధిక మొత్తం తీసుకుంటారు అని చెపుతున్నారు. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అంటే టాప్ హీరోయిన్ల కంటే ఈ బాడీ డబల్ రెమ్యూనరేషన్ ఎక్కువగా ఉండటం. అయితే ఈ అమౌంట్ కు సంబంధించి అధికారిక సమాచారం లేదు కానీ ..ఈ విషయం ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ప్రభాస్ ఇప్పుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కల్కి 2898 తో పాటు మారుతో దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజా సాబ్ సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రభాస్ నటించిన సలార్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే.

Tags:    

Similar News