కరోనాతో టీఎన్ఆర్ మృతి

Update: 2021-05-10 06:37 GMT

పాపులర్ సినీ జర్నలిస్ట్, నటుడు టీఎన్ఆర్ ఇక లేరు. ఆయన అసలు పేరు తుమ్మల నరసింహరెడ్డి. సినీ ప్రముఖుల ఇంటర్వ్యూల విషయంలో టీఎన్ఆర్ కొత్త ఒరవడి సృష్టించారనే చెప్పొచ్చు. దర్శకుడు అవుదామని పరిశ్రమలోకి వచ్చిన టీఎన్ఆర్ జర్నలిస్టుగా, నటుడుగా ఫుల్ బిజీగా ఉన్న సమయంలో కరోనా బారినపడ్డారు. గత కొన్ని రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.

మొదట హోం ఐసోలేషన్‌లో ఉన్న టీఎన్‌ఆర్‌ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో కుటుంబసభ్యులు ఆయన్ను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. టీఎన్‌ఆర్‌ మృతి పట్ల పలువురు ప్రముఖులు, జర్నలిస్టులు సంతాపం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News