టాలీవుడ్ లో ఇప్పుడు స్టార్ హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే అందులో పూజా హెగ్డె ఒకరు. ఆమె చేసిన సినిమాలు అన్నీ బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలను సాధిస్తున్నాయి. దీంతో ఆమెకు క్రేజ్ పెరిగిపోయింది. తెలుగులో ఆమె ప్రస్తుతం చాలా సినిమాలే చేస్తోంది. తాజాగా మాల్దీవుల్లో హాలిడేస్ ఎంజాయ్ చేసి వచ్చిన ఈ భామ మళ్ళీ షూటింగ్ లకు రెడీ అవుతోంది. ఇటీవల పూజా హెగ్డెకు చెందిన ఫోటో ఒకటి ప్రముఖ ట్రావెల్ మ్యాగజైన్ కవర్ పేజీగా వేసింది.
ఆ సందర్భంగా దిగిన ఫోటోల్లో ఇది ఒకటి. బంతి పూలతో సరదాగా ఆడుకుంటున్న ఈ ఫోటోను పూజా తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. అంతే కాదు..తనకిష్టమైన మ్యాగజైన్ లో ఇలా రెండవ సారి కవర్ పేజీ ఫోటో రావటం ఆనందంగా ఉంది అంటూ పేర్కొంది. పూజా నటించిన సినిమాలు రాధే శ్యామ్, ఆచార్యలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. తమిళంలో విజయ్ తో కలసి పూజా హెగ్డె ఒక సినిమా చేస్తోంది.